BREAKING : మార్చి 24న ఏపీలో ఆ స్థానానికి ఉప ఎన్నిక..షెడ్యూల్ విడుదల

-

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. కాసేపటి క్రితమే ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఇటీవలే మృతి చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా స్థానాన్ని భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ ను జారీ చేసింది.

మార్చి 24 వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే అదే రోజున కౌంటింగ్ కూడా నిర్వహించాలని డిసైడ్ అయింది ఎన్నికల సంఘం. ఇక వచ్చే నెల 7వ తేదీన ఖాళీగా ఉన్న ఈ ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదల కానుంది.

14 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేయనుంది ఎన్నికల సంఘం. మార్చి 15 న స్క్రూటినీ నిర్వహించనుండగా.. మార్చి 17 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది కానుంది. కరీమున్నిసా స్థానాన్ని ఆమె కుమారుడితో భర్తీ చేయాలని ఇప్పటికే సీఎమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే వైసీపీ ఎమ్యెల్యేలు ఎక్కువ గా ఉన్న నేపథ్యంలో ఈ స్థానం ఏకగ్రీవం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version