పూల పండుగతో తెలంగాణ పులకించింది : ఎమ్మెల్సీ కవిత

-

తెలంగాణ లో బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఎంగిలి పూలతో ప్రారంభం అయిన సంబురాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఊరూరా చిన్నపిల్లల నుండి మహిళలు పెద్దలు బతుకమ్మ పాటలు పాడుతూ పువ్వులను పూజించారు. ఇక ఇప్పటికే సద్దుల బతుకమ్మ సంబరాలు కూడా మొదలయ్యాయి. అయితే సద్దుల బతుకమ్మను ఒక్కో ఊర్లో ఒక్కో రోజూ జరుపుకోవడం కనిపిస్తోంది. నిన్న కొన్ని ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు పూర్తవగా ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇక రేపు కూడా కొన్ని ఊర్లలో సద్దులు జరగనున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. “పూల పండుగతో తెలంగాణ పులకించింది. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.” అంటూ కవిత తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news