హుజురాబాద్ ఉప ఎన్నిక : రంగంలోకి కేంద్ర బలగాలు

హుజురాబాద్ ఉప ఎన్నిక పై నిఘా కట్టు దిట్టం చేసింది అధికార యంత్రాంగం. ఏకంగా 1900 మంది బలగాల తో బందో బస్తు ఏర్పారు చేశారు అధికారులు. అంతే కాదు అతి త్వరలోనే 120 సెక్షన్ ల కేంద్ర బలగాలు రంగంలోకి దిగనున్నాయి. బ్ల్యు కోట్స్,పెట్రో కారులతో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టనున్నారు పోలీసులు.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. నాలుగు మండలాలలో 406 సిసి కెమెరాలు ఏర్పాటు ఏర్పాటు చేశారు. హుజురాబాద్ లో 110,జమ్మికుంటలో 169,వీణవంక లో 87,ఇల్లందకుంటలో 36 కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు.

ఇక ఇప్పటి వరకు 12 రోజుల్లో కోటి 27 లక్షల నగదు పట్టుబడినట్లు పోలీసులు పేర్కొన్నారు. మూడు లక్షల విలువైన మద్యం, గంజాయి, జిలేటిన్ స్టిక్స్ డిటోనేటర్లు,75 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు ఎన్నికల ఉల్లంఘన ఘటనల్లో 33 కేసులు నమోదు అయ్యాయని పోలీసులు చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ కాకుండా 24 గంటలు రెండు సైబర్ క్రైమ్ టీమ్స్ నిఘా పెట్టారు.