95 – 105 సీట్లు గెలుస్తాం: ఎమ్మెల్సీ కవిత

-

ట్విటర్లో నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతున్న ఎమ్మెల్సీ కవిత ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈసారి తెలంగాణలో BRS గెలుస్తుందనే నమ్మకం ఉందా? అన్న ప్రశ్నకు కవిత రిప్లై ఇచ్చారు. ‘తెలంగాణ ప్రజలు మేధావులు. వీరు రాష్ట్రంలో జరిగిన ప్రగతిని చూస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో 95-105 సీట్లు గెలుస్తాం’ అని ఆమె చెప్పారు. బీసీని సీఎం చేస్తానని బీజేపీ చెప్పడం ఎన్నికల జిమ్మిక్కులు మాత్రమేనని ఎద్దేవా చేశారు

కామారెడ్డి జిల్లాకు చెందిన రెడ్డి ఐక్యవేదిక నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో కవితను కలిశారు. కామారెడ్డిలో కేసీఆర్‌ అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కేసీఆర్‌ గెలుపు కామారెడ్డికి శక్తినిస్తుందని, ఈ ప్రాంతం ఊహించనంత అభివృద్ధి చెందుతుందన్నారు. కామారెడ్డి రూపురేఖలు మారడంతో పాటు పొరుగున ఉన్ను జిల్లాలు కూడా శాశ్వతంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీ చేస్తున్నారని ప్రకటించగానే కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం వచ్చిందని, తమ ప్రాంతం మరింత అభివృద్ధితో దూసుకెళ్తుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని వివరించారు. ప్రత్యేక అభివృద్ధి నిధులతో కావాల్సినంత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. పరిశ్రమలు, సంస్థలు వస్తాయని, దాంతో కామారెడ్డితో పాటు నిజామాబాద్‌ జిల్లాలో ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండబోదని స్పష్టం చేశారు. సాగునీటి వనరులు పెరుగుతాయని, రైతులు ఎంతో లాభపడుతారని చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version