తెలంగాణా రాష్ట్రంలో అన్ని కలెక్టరెట్ ల ముందు బీజేపీ ఆందోళనలు చేయడానికి సిద్దం అయింది. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు బీజేపీ నిరసన మొదలు పెట్టింది. ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఎల్ఆర్ఎస్ Lrs జీఓ ను రద్దు చేయాలని, అర్హులకు డబల్ బెడ్రూం ఇల్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ తో కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసనకు పిలుపు నిచ్చింది బీజేపీ. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. గేటు దూకే ప్రయత్నం చేసిన కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నిరసనకు నాయకత్వం వహించిన బీజేపీ ఎమ్మెల్సీ రామ చందర్ రావ్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అంతకు ముందు మాదాపూర్ లోని శ్రీచైతన్య లో పనిచేసే ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. వీరికి బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మద్దతు తెలిపారు. శ్రీ చైతన్య విద్యాసంస్థలు అవలంబిస్తున్న తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకు లక్షల రూపాయల ఫీజుల తో పాటు ఆన్లైన్ క్లాసుల పేరుతో డబ్బులు దండుకుంటున్నారు తప్ప విద్య సంస్థ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం ఎలాంటి జీతాలు చెల్లించడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.