హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.. నేటి పూర్తిస్థాయిలో ఎంఎంటీఎస్‌ సేవలు

-

గత వారం భారీ వర్షాలు కురియడంతో జనజీవనం స్థంభించింది. వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసాయి. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ సేవలు రద్దు చేశారు. అంతేకాకుండా పాఠశాలలకు సైతం సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. నేటి నుంచి సామాన్యుల బండి ఎంఎంటీఎస్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 75 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు 16 మెమూ పాసింజర్లు సోమవారం నుంచి యధాతథంగా నడవనున్నాయి.

వర్షాల కారణంతో 8 రోజులు షెడ్డుకు పరిమితమైన రైళ్లు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. సోమవారం నుచి పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమవుతుండటంతో అదే స్థాయిలో ఎంఎంటీఎస్ రైళ్లు. నగర శివారు పరిసరాలను కలుపుతూ నడిచే పాసింజర్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. అలాగే నేటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు కూడా పునః ప్రారంభం కానున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version