నేటి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమవేశాలు

-

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల‌కు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల స‌మావేశాలు ఆగస్టు 12న ముగియనున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం ప‌లు బిల్లుల‌ను తీసుకురావ‌డానికి సిద్ధ‌మవుతోంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు దేశంలో నెల‌కొన్న ప‌లు ఘోర ప‌రిస్థితులు, ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలు లేవ‌నెత్త‌డానికి సిద్ధమయ్యాయి. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల‌కు ముందు జ‌రిగే అఖిలప‌క్ష స‌మావేశాన్ని ఆదివారం నాడు నిర్వ‌హించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. స‌మావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజ‌రుకానున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నందున ఈ వ‌ర్షాకాల స‌మావేశాల‌కు అత్యంత ప్రాముఖ్య‌త ఏర్ప‌డింది. నేటి నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద‌మొత్తంలో బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతోంది.

కంటోన్మెంట్ బిల్లు, మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్లుతో సహా 24 బిల్లులను ప్రకటించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం జాబితా చేసిన బిల్లుల‌లో కొన్ని ఇత‌ర బిల్లులు ఇలా ఉన్నాయి.. ది కాఫీ (ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్) బిల్లు, ఎంటర్‌ప్రైజెస్ అండ్ సర్వీసెస్ హబ్‌ల అభివృద్ధి బిల్లు, ఇది ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం- 2005కి సంబంధించిన‌ది. ఇది దాని ఫ్రేమ్ నియమాలను సవరించాలని ప్రతిపాదిస్తుంది. వస్తువుల భౌగోళిక సూచనలు (రిజిస్ట్రేషన్ అండ్ రక్షణ) (సవరణ) బిల్లు, గిడ్డంగుల (అభివృద్ధి అండ్ నియంత్రణ) (సవరణ) బిల్లు, the Competition (Amendment) Bill లు ఉన్నాయి. మొత్తం 24 బిల్లులతో పాటు మరో ఎనిమిది బిల్లులు ఇప్పటికే ఉభయ సభల ముందు పెండింగ్‌లో ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version