మొబైల్‌ వినియోగదారులకు ఊరట!

-

సెల్‌ఫోన్‌ వినియోగదారులపై రేపో, మాపో టారిఫ్‌ల పెంపు తప్పదని ఇటీవల వార్తలు వచ్చేవి. పరిశ్రమ మనుగడ కోసం చార్జీల పెరుగుతున్నాయని, అలాగే 4జీ నెట్‌వర్క్‌ విస్తృతి కోసం టారిఫ్‌ చార్జీలు పెంచే అవకాశం ఉన్నట్లు గతంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రకటించాయి. అయితే, ప్రస్తుతం టెలికాం మార్కెట్‌ లీడర్‌ జియో మాత్రం భిన్నంగా చర్యలు తీసుకుంటుంది. ధరలు పెంపు విషయానికి వెళ్లకుండా కొత్త మార్గాన్ని అన్వేషించింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా 2జీ వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం కొత్తగా జియో ఫీచర్‌ఫోన్లను మార్కెట్‌ లోకి తీసుకొచ్చింది. అదే విధంగా ఈ టెలికాం రంగంలో వివిధ కొత్త వినూత్న ప్రయోగాలు చేస్తూనే ఉంది.అయితే, రూ.1999కే జియో ఫీచర్‌ ఫోన్ తో పాటు రెండేళ్ల పాటు అపరిమిత కాల్స్, డేటా ఆఫర్‌ ఇవ్వడంతో ఇప్పట్లో ఛార్జీల పెంపునకు సుముఖంగా లేమనే సంకేతాలు జియో ఇచ్చినట్లయ్యింది.

దీనివల్ల మిగతా కంపెనీలు చార్జీలు పెంపు విషయంలో వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయ సమాచారం. ఇది మిగిలిన నెట్‌వర్క్‌ సంస్థలకు ఇబ్బంది కరమే అయినా, ప్రస్తుతానికి వినియోగదారులకు మాత్రం ఊరట కలిగిస్తోంది. దేశంలో ఉన్న 30 కోట్ల మంది 2జీ వినియోగదార్లను 4జీకి మార్చడమే తమ లక్ష్యమంటూ గతవారం ‘కొత్త జియోఫోన్ 2021’ను రిలయన్ జియో విడుదల చేసింది.

రెండేళ్ల పాటు అపరిమిత కాల్స్, ప్రతి నెల 2జీబీ డేటా, కొత్త జియోఫోన్ల ను కేవలం రూ.1999కి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఇది టెలికామ్‌ రంగంలో సంచలనంగా మారింది. అలాగే, ఇప్పటికే జియోఫోన్‌ వాడుతున్న వినియోగదారులు సంవత్సరానికి రూ.749 చెల్లించి అపరిమిత కాల్స్, డేటా సదుపాయాలు పొందవచ్చు. దీంతోపాటు నెలకు రూ.22 నుంచి మరో 5 ప్రీపెయిడ్‌ పథకాలను కూడా జియోఫోన్‌ సబ్‌స్క్రైబర్‌ల కోసం తెచ్చింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా 2జీ చందాదార్లు ఇప్పటికీ నెలకు అధిక మొత్తాలు చెల్లిస్తున్నారని, వీరికి తక్కువ ఖర్చయ్యే పథకాలతో తమ నెట్‌వర్క్‌కు ఆకర్షించగలమని జియో భావిస్తోంది. కొంత కాలంగా జియో ఖాతాదారుల సంఖ్య చాలా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ఈ ప్రయోగంతో మళ్లీ తన వినియోగదారులను పెంచుకోనుంది జియో.

Read more RELATED
Recommended to you

Exit mobile version