ఇక పల్స్ ఆక్సిమీటర్ కోసం ఆక్సిమీటర్‌లు కొనుక్కునే అవసరం లేదు. అయితే ఈఈ సరికొత్త యాప్ ఎలా పనిచేస్తుందనేది తెలుసుకుందాం. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ కెమెరా, ఫ్లాష్‌లైట్‌ను ఉపయోగించి, పీపీజీ చేయవచ్చని కరోనా హెల్త్ కేర్ బులెటిన్ బృందం తెలిపింది. అసలే కొవిడ్ సమయం మన బ్లడ్‌లో ఆక్సిజన్ లెవల్స్ తెలుసుకునే సమయం. దీనికోసం ఆక్సిమీటర్, స్మార్ట్ వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. పల్స్ ఆక్సిమీటర్‌ల ధరలు కూడా ఆమాంతం పెరిగిపోయాయి.
ప్రతి ఇళ్లలో ఇవి సాధారణమయ్యాయి. కానీ, యాప్‌ను సృష్టించింది కోల్‌కతా కు చెందిన కరోనా హెల్త్ కేర్ టెక్ కంపెనీ. ఆ యాప్ పేరే కేర్‌ప్లెక్స్ వైటల్. ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి కెమెరా, ఫ్లాష్‌లైట్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ యాప్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. కేవలం ఫ్లాష్‌లైట్ మీద 40 సెకన్లు వేలిని పెడితే ఎస్‌పీఓ2ను ఈజీగా లెక్కిస్తుంది.
లైట్ ఇంటెన్సిటీ ఆధారంగా పీపీజీ గ్రాఫ్‌ను ఈ యాప్ సిద్ధం చేస్తుంది. కేర్‌ప్లిక్స్ యాప్ ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. కెమెరా, ఫ్లాష్‌లైట్ మీద ఎంత బలంగా వేలిని అదిమి ఉంచితే అంతటి కచ్చితమైన ఫలితాలు వస్తాయని సంస్థ చెబుతోంది. నెట్ కనెక్షన్ సాయంతో మీ ఎస్‌పీఓ2, పల్స్ వివరాలు యాప్ నుంచి క్లౌడ్‌లో సేవ్ అవుతాయి. అవసరమైనప్పుడు యాప్ ద్వారా పాత వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్ క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించారు. ట్రయల్స్ ఫలితాల్లో చాలా వరకు కచ్చితత్వం వచ్చింది. హార్ట్ బీట్ కూడా సేమ్ ఫలితాలు నమోదయ్యాయి.
స్మార్ట్‌వాచ్‌లు కొనలేనివారికి ఈ యాప్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి యాప్స్‌ను అధికారికంగా సూచిస్తే బాగుంటుందని తెలిపారు.