మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్ వాడుతున్నారా…?

-

సంపాదన పది రూపాయలు ఉంటే, ఖర్చు 20 రూపాయలు ఉంటుంది. ఈ రోజుల్లో ఇదే కదా మనం ఎక్కువగా చూస్తున్న ట్రెండ్. ఏదైనా కనపడితే చాలు ఎగబడిపోయి కోనేస్తూ ఉంటాం. బయట షాపింగ్ కి వెళ్ళినప్పుడు కొన్నారు అంటే ఒక అర్ధం ఉంటుంది. అన్నం తినేసి మంచం మీద పడుకుని ఫోన్ లో ఆన్లైన్ లో చూస్తూ అది బాగుంది ఇది బాగుంది అంటూ కోనేస్తూ ఉంటారు.

దీనితో ఆర్ధిక౦గా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజుల్లో మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్ సహా అనేక యాప్స్ అందుబాటులోకి రావడంతో జేబులో చేయి పెట్టకుండానే ఫోన్ లోనే సొమ్ము అంతా అయిపోతుంది. తీరా క్రెడిట్ కార్డుల ద్వారా కూడా ఎక్కువగా షాపింగ్ చేయడానికి అలవాటు పడి అనవసర వస్తువులనుఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దీనికి బానిసలు అయ్యారు.

వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టే మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ సహా అనేక యాప్స్ అనేక ఆఫర్లు ఇస్తూ బుట్టలో పడేస్తున్నాయి. వెయ్యి రూపాయల వస్తువు 300లకే వస్తుంది అని కొంటారు. వస్తే వస్తుంది అమ్ముకోవడానికి వాడు అనేక ఆఫర్లు పెడతాడు. దానికి నువ్వు జేబులు గుల్ల చేసుకుని నేలాఖరకు పప్పు ఉప్పు కి అప్పు తెచ్చుకోవడం అవసరమా…? అసలు ప్రాణం మీదకు వచ్చేవి ఏమి ఉంటాయి ఆన్లైన్లో…? వినోదం కోసం సరదా కోసమే కదా…? కాబట్టి ఆన్లైన్ బ్యాంకింగ్ వాడకం తగ్గించండి. భవిష్యత్తుకి అది ఎంత వరకు శ్రేయస్కరం కానే కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version