మహిళ జీన్స్‌లో పేలిన మొబైల్.. మంటలు రావడంతో జనాల పరుగులు

-

మనం నిత్యం వాడే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌తో అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకుంటే అవి చార్జింగ్ పెట్టిన క్రమంలో, లో బ్యాటరీ సమయం లేదా ఓవర్ హీట్ అయిన సమయంలో ఎక్కువగా వినియోగిస్తే పేలిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని నిపుణులు సైతం చెబుతున్నారు. అయినప్పటికీ కొందరు చార్జింగ్ పెట్టి మరీ గేమ్స్ ఆడటం, కాల్స్ మాట్లాడటం చేస్తుంటారు.

ఇలానే ఓ మహిళ మొబైల్ అతిగా యూజ్ చేసి తన జీన్స్ ప్యాంట్‌ పాకెట్‌లో మొబైల్ పెట్టుకుంది. ఉన్నట్టుండి ప్యాంట్ లో మొబైల్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకున్నట్లు సమాచారం. భర్తతో కలిసి సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా.. మహిళ వెనక పాకెట్‌లో ఒక్కసారిగా ఫోన్ పేలింది.ఈ ప్రమాదంలో ఆమె వెనుక భాగం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా.. నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version