నిజమాబాద్ జిల్లాలో కలకలం. నిజమాబాద్ జిల్లాలో కోళ్లను బర్డ్ ఫ్లూ , కొక్కెర వైరస్ వణికిస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ – ఆంధ్ర సరిహద్దుల్లో అప్రమత్తం అయ్యారు తెలంగాణ రాష్ట్ర అధికారులు. కందకుర్తి, సాలురా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
కోళ్లు, కోడి దాణా రాకుండా 24 గంటల పాటు నిఘా పెట్టారు.. బీర్కూర్, పోతంగల్, రుద్రూర్ వేల్పూరు, భీంగల్, బాన్సు వాడ, బొర్లంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో కోళ్ల మృత్యువాత పడ్డాయి. దింతో చికెన్ సెంటర్లపై ప్రభావం పడనుంది. అటు ఇప్పటికే తగ్గిన చికెన్ అమ్మకాలు తగ్గాయి.
అటు ఏపీ కోళ్లపై బ్యాన్ విధించారు. దింతో తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మూడు చెక్ పోస్టులు చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపుతున్నారు అధికారులు.