రెండు రోజుల క్రితం డిల్లీ వేదికగా కెబినెట్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ లో దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో బీజేపీ బాధ్యతలను అప్పగించిన నాయకుల విషయంలో కీలక మార్పులు గురించి చర్చ జరిగింది. కానీ తుది నిర్ణయాన్ని ప్రకటించకుండాఆ బీజేపీ నాయకుల గుండెల్లో ఇంకా ఆ టెన్షన్ ను ఉంచింది. కాగా తాజాగా ఢిల్లీ లో ఉన్న ప్రధానమంత్రి నివాసంలో మోదీతో పాటుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరియు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లు ముగ్గురూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని వార్త రాజకీయ వర్గాలలో తిరుగుతోంది. ఈ మీటింగ్ లో కాబినెట్ లో పలువురు మారనున్నారట. అయితే ఇందులో ఎవరిని తొలగించాలి ? ఎవరికి చోటు కల్పించాలి అన్న విషయం పై ఈ ముగ్గురూ ప్రధానంగా చర్చించుకుంటున్నారు.