రేవంత్ రెడ్డిది రెండు నాలుకల ధోరణి : హరీశ్ రావు

-

రేవంత్ రెడ్డిది రెండు నాలుకల ధోరణి అని విమర్శించారు మాజీ మంత్రి హరీశ్ రావు. తాజాగా సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ అన్నం పెట్టే రైతును అడుక్కునే వాడిగా మార్చకండి అని పేర్కొన్నారు. పత్తి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. అకాల వర్షాల కారణంగా పత్తి పంట వేసిన రైతులకు నష్టం జరిగింది. పత్తి, కంది, హార్టికల్చర్ రైతులకు అన్యాయం చేస్తే.. తస్మాస్ జాగ్రత్త అని హెచ్చరించారు హరీశ్ రావు. 

రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తులు పెట్టండని మళ్లీ రేవంత్ రెడ్డి అంటున్నారు. రైతులు కాంగ్రెస్ నాయకుల చుట్టూ మళ్లీ తిరగాలా..? అని ప్రశ్నించారు. చెరకు, పత్తి, ఇతర పంటలకు ఒకేసారి రైతు భరోసా ఇస్తారంట. ఒక్కసారే రైతు భరోసా ఇస్తే.. లక్షలాది మందికి అన్యాయమే అని పేర్కొన్నారు. రైతుల గౌరవం పెరిగేలా బీఆర్ఎస్ కృషి చేసిందని తెలిపారు. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు హరీశ్ రావు. రైతులకు ఇచ్చిన హామీ మీరు నిలుపుకున్నారా..? అని ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version