దావులూరి ప్రభావతి పై నూజివీడు పోలీసులకి ఫిర్యాదు..!

-

ఏలూరు జిల్లాలోని లేడీ రౌడీ షీటర్, మాజీ యూనియన్ బ్యాంక్ మేనేజర్ దావులూరి ప్రభావతి పై నూజివీడు పోలీసులకి ఫిర్యాదు చేసారు. దోనవల్లి వెంకట్రావు అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేసారు. అయితే వాటర్ ట్యాంక్ వద్ద బోరు వదలటానికి వెళ్తే తనను కట్టేసి తండ్రి, తనయుడుతో కలిసి ప్రభావతీ దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు చేసిన వెంకట్రావు తెలిపారు. నూజివీడు మండలం మర్రిబందం గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే వెంకట్రావును ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఇక తనపై దాడికి పాల్పడినట్టు ప్రభావతీ కూడా పోలీసులకి ఫిర్యాదు ఇచింది. ప్రస్తుతం విచారణ చేపట్టారు పోలీసులు. ఇక ఇప్పటికే అనేక కేసులు ప్రభావతీ పై ఉండటంతో ఈ కేసులో వెంకట్రావును ఫిర్యాదుపై విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్రావు బాగానే ఉన్నాడని పోలీసులు తెలిపారు

Read more RELATED
Recommended to you

Exit mobile version