బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో మోదీ, అమిత్ షాకు నిద్ర పట్టడం లేదు : జగ్గారెడ్డి

-

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.తమ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ కి టచ్ లో ఉన్నారా? వాళ్ళ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారా? అనేది లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాక తెలుస్తుందని అన్నారు. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం రోజున గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ ఏం మాట్లాడినా తిప్పికొట్టే వ్యూహాలు తమ దగ్గర ఉన్నాయని,కాంగ్రెస్ లో అందరూ తోపులేనని.. కాంగ్రెస్‌లో లీడర్లకు కొదవ లేదని తెలిపారు.

కేసీఆర్ ఏం చేసినా తమకు ఏం కాదన్నారు. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని… ఆయన మాటలు ఎవరు పట్టించుకోవడం లేదని జగ్గారెడ్డి తెలిపారు. కేసీఆర్ మాటలకు ఆగస్టులో సమాధానం చేప్తానన్నారు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ,అసలైన దేశభక్తులు రాహుల్ గాందీ కుటుంబమే అన్నారు జగ్గారెడ్డి. దేశభక్తి అంటూ డబ్బా కొట్టుకునే బీజేపీకి నార్త్ లో గ్రాఫ్ పడిపోయిందని విమర్శించారు. బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో మోదీ, అమిత్ షాకు నిద్ర పట్టడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రతో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందన్నారు జగ్గారెడ్డి

.

Read more RELATED
Recommended to you

Exit mobile version