ఎవరైనా లాక్ డౌన్ ని బ్రేక్ చేస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే అని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. లాక్ డౌన్ ని పాటించాలని సూచించారు. జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం కరోనా రాదని అన్నారు. కరోనాకు వైద్యం లేదని నివారణ ఒక్కటే మార్గమని అన్నారు. ఆయన ఆదివారం మాన్ కి బాత్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులతో ప్రజలతో మోడీ మాట్లాడారు.
కరోనా నియంత్రణ కు వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. ఇప్పటికే చాలా మంది కోలుకున్నారని అన్నారు. ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యమన్నారు. కరోనా నయం అయ్యే వ్యాధే అని కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నారు. కరోనాపై పోరాడుతున్న వారే తనకు ఆదర్శమని మోడీ అన్నారు. నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం తప్పదని అన్నారు. కరోనాపై గెలవాలి అంటే కఠిన నిర్ణయాలు తప్పవని అన్నారు.
ప్రపంచ దేశాలను చూసిన తర్వాతే లాక్ డౌన్ నిర్ణయమని అన్నారు. కరోనా కట్టడి కావాలి లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదన్న ఆయన దినసరి కూలీల కష్టాలు తనకు తెల్సు అన్నారు. ప్రజల రక్షణ కోసమే లాక్ డౌన్ అని అన్నారు. వైద్య సిబ్బంది జవాన్ల మాదిరి పోరాడుతున్నారని అన్నారు. లాక్ డౌన్ విషయంలో ప్రజల అసౌకర్యానికి చింతిస్తున్నా అని అన్నారు.
వైరస్ ప్రభలకుండా ఉండాలి అంటే కఠిన నిర్ణయాలు తప్పవని అన్నారు. ఎవరూ కూడా లక్ష్మణ రేఖ దాటకుండా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. కరోనాపై మనం గెలిచి తీరాల్సిందే అని అన్నారు. డాక్టర్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అందరూ ఒక్కటై కరోనాపై యుద్ధం చెయ్యాలని అన్నారు. అందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించాలి అని మోడీ వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్ జయించిన వారే మనకు స్ఫూర్తి ప్రదాతలు, మీ సమయనమే శ్రీరామ రక్ష అని మోడీ అన్నారు. కరోనా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైన వ్యాధి కాదని అన్నారు. మీరు నిభందనలు పాటించకపోతే ఇతరులకు ముప్పు అని అన్నారు. మానవత్వానికే కరోనా సవాల్ విసురుతుందని అన్నారు. కరోనా నియంత్రణకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.