భారత్ ప్రస్తుతం చిన్న చిన్న విషయాల గురించి కలలు కనడం మానేసిందని మోడీ అన్నారు పెద్ద పెద్ద కలలు కంటూ వాటిని నెరవేర్చుకోవడానికి శ్రమిస్తుంది అని అన్నారు. అమృత భారత్ పథకం కింద సుమారు 41 వేల కోట్లు విలువైన 2000 కంటే ఎక్కువ రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించారు మోడీ.
ఆ తర్వాత మోడీ మాట్లాడుతూ పదేళ్లలో బిజెపి నూతన భారత్ ని ప్రారంభించింది అని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని దోచుకోవడం ఆగిందని అన్నారు సంపాదించిన ప్రతిపక్ష అభివృద్ధి కోసమే ఉపయోగిస్తున్నామని అన్నారు. భారతీయ రైలులో ఒకప్పుడు రాజకీయ బాధితురాలుగా ఉండేవని ప్రస్తుతం ప్రయాణ సౌలభ్యానికి అనుకూలంగా ఉన్నాయని అన్నారు.