ప్రజలు ఆస్తుల్ని దోచుకోవడానికి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని నరేంద్ర మోడీ విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్ లో అలీగడ్లో ఆయన ర్యాలీలో మాట్లాడారు కాంగ్రెస్ మిత్ర పక్షాలు ప్రజల ఆస్తుల మీద దృష్టి పెట్టాయని అధికారం లోకి రాగానే ఉన్నదంతా లాక్కుంటారని అన్నారు మోడీ. అలీగర్ ప్రజలు బుజ్జగింపులు బంధుప్రీతి అవినీతికి తాళాలు వేశారని అన్నారు.
ఇద్దరు యువరాజులకి పటిష్టమైన తాళం వేశారని రాహుల్ అఖిలేష్ యాదవ్ లని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మొదట్లో ఉగ్రవాదులు వరుస పేలుళ్లకి పాల్పడే వారని అయోధ్య కాశీలని వదల్లేదని కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో వరుస పేలుళ్లకి ఫుల్ స్టాప్ పడిందని అన్నారు మోడీ. కాంగ్రెస్ బుజ్జగింపు విధానాన్ని అనుసరించింది కానీ ముస్లింల సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ఏమీ చేయలేదని ఫైర్ అయ్యారు.