మోడీ: కంటెంట్ క్రియేటర్లు అత్యంత విలువైన వాళ్ళు..!

-

దేశవ్యాప్తంగా డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి అవగాహనని పెంపొందించడానికి స్థానిక భాషల్లో కంటెంట్ ని అందించడానికి కృషి చేయాలి అన్నారు మోడీ. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జాతీయ సృష్టికర్తల అవార్డుని అందించిన తర్వాత మోడీ మాట్లాడారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి చాలా మంది కంటెంట్ క్రియేటర్లు కృషి చేస్తున్నారు స్థానిక భాషల్లో కంటెంట్ లేకపోవడం వలన ప్రజలకు అర్థం కావట్లేదు అన్నారు.

దేశవ్యాప్తంగా అందించాలంటే కంటెంట్ క్రియేటర్లు స్థానిక భాషల్లో కంటెంట్ ని అందించాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు నిద్రలేమితనం ఇతర మానసిక ఆరోగ్య సమస్యలను సీరియస్ గా చాలా మంది తీసుకోరు. కానీ వీటి వలన చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు ఈ సమస్యలు పరిష్కారంలో కంటెంట్ క్రియేటర్ లని అత్యంత విలువైన వాళ్ళగా మోడీ అభివర్ణించారు. దేశ రాజధానులు జరిగిన ఈ కార్యక్రమంలో 20 విభాగాలకి అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news