దేశవ్యాప్తంగా రెండవ దశ ఎన్నికలు జరుగుతున్న వేళ మోడీ తన ప్రచారాన్ని ఇంకాస్త వేగవంతం చేశారు. శుక్రవారం నాడు పశ్చిమబెంగాల్లోని మాల్దా ఉత్తర్వులు జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ టీఎంసీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులని బెంగాల్లో సెటిల్ చేసేందుకు టిఎంసి కృషి చేస్తుందని మోడీ అన్నారు.
టిఎంసి చేసిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం రాష్ట్రంలో 26 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బెంగాల్ యువకుల భవిష్యత్తుతో పార్టీ ఆడుకుంటుందన్నారు టీఎంసీ పాలనలో వేలకోట్ల స్కాములు జరిగాయని రాష్ట్ర ప్రజలు అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వ కట్ అండ్ కమిషన్ సంస్కృతి కారణంగా యువత నష్టపోయారని మోడీ అన్నారు.