క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేసిన టీమిండియా కోచ్..!

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ విజయవంతంగా కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బెంగుళూరులో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఓటు వేశారు. క్యూలైన్లో నిల్చొని మరి ది వాల్ ఓటేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రజలను ద్రవిడ్ అభ్యర్థించారు. ప్రజాస్వామ్యంలో మనకు దక్కే అవకాశం ఇదే అని పేర్కొన్నారు.

టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే బెంగళూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగళూరు సౌత్ అభ్యర్థి తేజస్వీ సూర్య, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఓటేశారు. బీజేపీ అభ్యర్థులు సురేశ్ గోపి, అనిల్ ఆంటోనీ కూడా ఓటు వేశారు. చిరుత బ్యూటీ నేహా శర్మ బిహార్ లో ఓటేయగా.. మలయాళీ నటుడు టొవినో థామస్ కేరళలో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news