టీఎంసీ బెంగాల్ని ఎదగనివ్వట్లేదని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన కామెంట్స్ చేశారు పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చేశారు. బెంగాల్ ప్రజల్ని ఎదగనివ్వట్లేదని అన్నారు. రాష్ట్రంలో పేదలను, పేదలుగానే ఉంచారని అన్నారు తద్వారా రాజకీయాలు చేయాలని చూస్తోందని అన్నారు బెంగాల్ పర్యటనలో ఉన్న మోడీ శనివారం నదియా జిల్లాలోని కృష్ణా నగర్లో 15 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు.
తర్వాత ఆయన మాట్లాడారు రాష్ట్రాన్ని త్వరలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు ప్రస్తుతం ప్రారంభించిన ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. బెంగాల్ లోని 42 పార్లమెంటు స్థానాలని బిజెపి గెల్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఎన్ డి ఏ 400 సీట్లు కైవసం చేసుకుంటుందని అన్నారు.