కాంగ్రెస్ నేతలే అమిత్ షా ఫేక్ వీడియోను క్రియేట్ చేసారు: BJP

-

ఎన్నికల వేళ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనాన్ని రేపుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్లు కొన్ని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి. అయితే ఈ వీడియోలని ప్రతిపక్ష పార్టీలు అస్త్రంగా మలుచుకుని బిజెపి మీద విరుచుకుపడుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న అమిత్ షా ఫేక్ వీడియోలు మీద మోడీ స్పందించారు. ఈ ఇష్యూ పై సోమవారం మాట్లాడుతూ ఫేక్ వీడియోలు సృష్టించే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తామని వార్నింగ్ ఇచ్చారు. ఓడిన వాళ్ళే ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని ప్రతిపక్షాలపై అగ్రహం వ్యక్తం చేశారు.

అమిత్ షా ఫేక్ వీడియోల వ్యవహారం మీద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో ప్రచారంపై ఢిల్లీ పోలీసుల ఉన్నత స్థాయి సమావేశం చేసి కేసు నమోదు చేసారు. అమిత్ షా పై ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వాళ్లను ట్రేస్ చేసే పనిలో పడ్డారుపోలీసులు.. కాంగ్రెస్ నేతలే అమిత్ షా ఫేక్ వీడియోను క్రియేట్ చేసారంటోంది కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యాలని బీజేపీ చూస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version