నీటి కొరత, విద్యుత్ కొరత..ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్స్ క్లోజ్ !

-

ఈ మధ్యకాలంలో నీటి సమస్యలు అన్ని చోట్ల ఎక్కువైపోయాయి. నీటి సమస్యలు కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎండాకాలంలో నీటి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక ఇది ఇలా ఉంటే యూనివర్సిటీలో కాలేజీల్లో కూడా ఈ పరిస్థితి మనం చూస్తున్నాం. నీళ్ల కొరత తో ఓయూలోని విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

నిన్న నీటి కొరత కారణంగా ఓయూలో విద్యార్థులు ఇబ్బంది పడడంతో ఆందోళనకు దిగారు. అయితే నీటి కొరత, విద్యుత్ కొరత కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ లో హాస్టల్స్ మూసివేస్తున్నట్టు చీఫ్ వార్డెన్ నోటీస్ ఇచ్చారు. నీరు, విద్యుత్ సక్రమంగా సరఫరా చేయాలని నిన్న ధర్నా చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version