చిరు వ్యాపారులకు మోదీ గుడ్ న్యూస్..!

-

కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ప్రత్యేకమైన లోన్ స్కీమ్‌ను ఆవిష్కరించింది. దీని పేరు పీఎం స్వనిధి యోజన. కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి స్కీమ్ కోసం రూ.5,000 కోట్లను కేటాయించింది. ఈ పథకం కింద రుణం పొందటానికి పెద్దగా కఠినమైన నిబంధనలు కూడా ఏమీ లేవు. ఈ స్కీమ్ కింద గరిష్టంగా రూ.10,000 వరకు రుణం పొందొచ్చు. వడ్డీ రాయితీతో ఈ లోన్ పొందొచ్చు. అంతేకాకుండా తీసుకున్న మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తే వడ్డీ భారం మరింత తగ్గుతుంది.

money
money

లోన్ కోసం అప్లై చేసుకోవాలని భావిస్తే http://pmsvanidhi.mohua.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఇక్కడ అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత వెండర్ కేటగిరి చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. తర్వాత సపోర్ట్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ స‌బ్‌మిట్ చేయాలి. తర్వాత మీకు లోన్ లభిస్తుంది. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అర్బన్ లోకల్ బాడీస్ జారీ చేసే వెండర్ ఐడీ కార్డు వంటివి అవసరం అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news