మోడీ ప్రభుత్వం అందిస్తున్న ముద్రా లోన్ తో ఈ వ్యాపారాలను మొదలుపెట్టచ్చు…!

-

ఎక్కువ మంది వ్యాపారాలు చేస్తున్నారు .మీరు కూడా వ్యాపారాలపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నారా..? వ్యాపారాల ద్వారా మంచిగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా అయితే ఇది మీ కోసమే. పైగా పెట్టుబడి గురించి మీరేం కంగారు పడాల్సిన పనిలేదు. సులభంగా ప్రధానమంత్రి అందిస్తున్న ముద్ర స్కీమ్ ద్వారా లోన్ పొందొచ్చు దాంతో వ్యాపారం మంచిగా నడుస్తుంది.

చాలా మంది వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి పెట్టుబడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే అలా కాకుండా మంచిగా మీరు వ్యాపారం చెయ్యాలంటే ముద్ర స్కీమ్ ద్వారా లోన్ తీసుకొని మంచిగా వ్యాపారంని స్టార్ట్ చేయొచ్చు. అయితే మరి ముద్ర స్కీమ్ ద్వారా ఎటువంటి వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేది కూడా చూద్దాం.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… ఈ ముద్రా లోన్ ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు, ఇతర NBFCల నుంచి తీసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా శిశు, కిషోర్, తరుణ్ విభాగాల కింద లోన్ ని ఇవ్వడం జరుగుతుంది. 50వేల లోపు రుణాలను శిశు, 50 వేల నుంచి ఐదు లక్షల లోపు కిషోర్, ఐదు లక్షల నుంచి పది లక్షల లోపు తరుణ్ కింద డివైడ్ చేసారు. ఇక ఎలాంటి వ్యాపారాలను చెయ్యచ్చనేది చూద్దాం.

పచారీ సామాన్లను అమ్మడం, నిత్యావసర వస్తువుల దుకాణం, కాస్మోటిక్స్, గృహోపకరణాలు వంటివి పెట్టచ్చు. కూల్ డ్రింక్స్, బ్రెడ్డు, కోడిగుడ్లు షాపు వంటివి కూడా మొదలు పెట్టవచ్చు. కిరాణా సామాన్లను అమ్మితే ఎక్కువ డబ్బులు మిగులుతాయి. కనుక మీరు ఏదైనా వ్యాపారంని స్టార్ట్ చెయ్యాలనుకుంటే ఇలా లోన్ ద్వారా పొందొచ్చు. మంచిగా లాభాలను వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version