8 చీతాలను విడుదల చేసిన ప్రధాని మోడీ..వీడియో వైరల్

-

నేడు ప్రధాన మంత్రి మోదీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర సెలబ్రిటీలు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాలన్నీ హ్యాపీ బర్త్ డే మోదీ అనే హాష్ ట్యాగ్‌తో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. మరోవైపు మోదీకి సంబంధించిన బైట్స్, విజువల్స్‌తో కొందరు అద్భుతమైన వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక ప్రధాన మంత్రి మోదీ పుట్టిన రోజు సందర్భంగా నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలను మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులోకి అధికారికంగా వదిలారు ప్రధాని మోడీ.

బోయింగ్ విమానం బి 747 జంబో జెట్ లో తీసుకువచ్చిన చిరుతపులను పార్కులోని ఎన్ క్లోజర్ లో విడిచిపెట్టారు. అనంతరం మోడీ స్వయంగా ఆ చీతాల ఫోటోలు తీశారు. చితాలను కునో నేషనల్ పార్క్ లోకి విడిచి పెట్టేందుకు మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఘన స్వాగతం పలికారు. గ్వాలియర్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తో పాటు, ఇతర బిజెపి నేతలు మోడీని సన్మానించి స్వాగతం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version