తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు జీఎస్టీ పరిహారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ. 17000 కోట్లు రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈ పరిహారంలో తెలంగాణ రాష్ట్రానికి రూ.542 కోట్లు రిలీజ్ కాగా, ఏపీకి విడుదలైన మొత్తం రూ.682 కోట్లు గా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ పరిహారంగా రూ.1,15, 662 కోట్లు రిలీజ్ చేసినట్లు కేంద్రం పేర్కొంది. అక్టోబర్ నాటికి సెస్ మొత్తం కలిపి, రూ.72,147 కోట్లు మాత్రమే వసూలైనప్పటికీ మిగతా రూ. 43, 515 కోట్లను తన సొంత వనరుల నుంచి కలిపి రాష్ట్రాలకు రిలీజ్ చేసినట్లు కేంద్రం వివరించింది.