ప్రస్తుతం ప్రతీ చోట యూపీఐ చెల్లింపులు కీలకంగా మారిపోయాయి. ఆన్ లైన్ షాపింగ్ కే కాదు.. చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేసేందుకు కూడా ఈ విధానాన్ని వాడుతున్నాం. దేశాన్ని న్యూ ఇండియా, డిజిటల్ ఇండియా గా మార్చడానికి ఇది చాలా ముఖ్యమైన సాధనం అనే చెప్పవచ్చు. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్ లైన్ టికెటింగ్ విధానం మొదలు పెట్టింది.
ప్యాసింజర్-కండక్టర్ మధ్య చిల్లర గొడవలకు ఈ విధానంతో స్వస్తీ చెప్పవచ్చు. ఇప్పటి నుంచి ప్రతీ సిటీ బస్సులో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ఉంచుతారు. యూపీఐ పేమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు టీజీఎస్ ఆర్టీసీ కల్పించింది. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా ఆర్టీసీ ఆన్ లైన్ టికెటింగ్ తీసుకొచ్చింది. త్వరలో మరిన్ని ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్టీసీ ప్రకటించింది.