SRH జట్టు సర్వనాశనమైందంటూ మాజీ క్రికెటర్ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ నబి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడటం చాలామందికి ఇష్టం ఉండేది కాదని ఆ జట్టు మాజీ క్రికెటర్ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ నబి అన్నాడు.
గత రెండేళ్లుగా ఫ్రాంచైజీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆటగాళ్లలో చాలామందికి అభద్రతాభావం ఏర్పడిందని తెలిపాడు. దాంతోనే జట్టులోని సగం మంది ఆటగాళ్లు అయిష్టంగా సన్రైజర్స్ తో కొనసాగారని తెలిపాడు. అనవసర మార్పులతో పటిష్టమైన సన్రైజర్స్ హైదరాబాద్ ను సర్వనాశనం చేశారని ఆరోపించారు. 2017 నుంచి రషీద్ ఖాన్ తో పాటు సుదీర్ఘకాలం సన్రైజర్స్ కు ఆడిన మహమ్మద్ నబీ, స్పోర్ట్స్ యారి యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.