మోక్ష మార్గం ముక్కోటి ఏకాదశి

-

(డిసెంబర్‌ 6 ముక్కోటి ఏకాదశి)
ఆధ్యాత్మికత, శాస్త్రీయతల కలయికలకు ప్రతీకగా నిలిచే పర్వదినం ముక్కోటి /వైకుంఠ ఏకాదశి. డిసెంబర్‌ 6న ముక్కోటి ఏకాదశి.
దక్షిణాయన పుణ్యకాలం పూర్తవుతూ, ఉత్తరాయణం సమీపించే సంధికాలంలో వచ్చే ఏకాదశి ఇది. 24 ఏకాదశుల్లో అత్యంత పవిత్ర-మైనది. శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని భక్తులకు దర్శనిమిచ్చే అపూర్వ సందర్భం ఈ ముక్కోటి ఏకాదశి. దీని విశిష్టత, ఆచరించాల్సిన నియమాలు…

వైకుంఠ ఏకాదశి:
పూర్వీకులు ఏడాదిని రెండు అయ-నాలుగా, 12 మాసాలుగా విభజించారు. ప్రతి మాసంలో రెండు పక్షాలు. వీటిలో పాడ్యమి – పౌర్ణ-మి/అమావాస్య తిథులు వస్తాయి. అంటే ప్రతి నెల రెండుసార్లు ఏకాదశి తిథి వస్తుంది. ఇలా ఏడాదికి 12 X 2 = 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కోదానికి ఒక్కో విశిష్టత ఉంది. కానీ వీటన్నింటిలో అత్యంత పవి-త్రంగా భావించేది వైకుంఠ ఏకాదశి. ధనుర్మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. తెలుగువారు అన్ని పండుగలను చాంద్ర-మానంలో ఆచరించినప్పటికీ ఈ ఏకాదశిని మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకొంటారు. సాధారణంగా మార్గశిర లేదా పుష్యమాసంలో వైకుంఠ ఏకాదశి వస్తుంది. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి. దీన్ని తమిళ-నాడు, కేరళ ప్రాంతాల్లో సౌరమానం పాటించేవారి నుంచి స్వీకరించారు.
ప్రాశస్త్యం: తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. సరిగ్గా నాలుగు నెలల అనంతరం కార్తీకంలో పరివర్తనం చెంది అంటే పక్కకు తిరిగి మార్గ/పుష్య మాసంలో వచ్చే ఏకాదశి నాడు భక్తులకు దర్శనమిస్తాడు. ఆ రోజు ముప్పై మూడుకోట్ల దేవతలు స్వామి దర్శనం కోసం వైకుంఠానికి వెళ్లి ఉత్తర ద్వారం వద్ద స్వామిని దర్శిం-చుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news