ఈ ప్రపంచ౦లో కష్టపడే ప్రతీ ఒక్కరు కూడా… డబ్బుని ఆదా చేసుకుందాం అనే చూస్తూ ఉంటారు… కష్టపడిన ప్రతీ రూపాయి కూడా… దాచుకోవాలి అనే కోరిక ఉంటుంది. కాని కొన్ని కారణాల వలన… డబ్బుని ఆదా చేసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు… దీనితో భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారికి డబ్బు దాచుకోవడంలో నాలుగు సూత్రాలు ఉన్నాయని అంటున్నారు… అవి ఏంటో ఒకసారి చూద్దాం…
నగదు నిర్వహణ… వచ్చిన డబ్బుని ఏ విధంగా ఖర్చు చెయ్యాలి అని చూడటం మానేసి నిత్యావసరాలకు… కూడు, గుడ్డ అనే రెండింటిని గుర్తు పెట్టుకుని… ఖర్చు చెయ్యాలి… అనవసర ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది నగదు నిర్వహణలో తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. వచ్చే ఆదాయాన్ని లాభదాయకమైన మార్గాల్లోకి మళ్ళిస్తు ఉండాలి… భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు చేస్తూ ఉండాలి. కోరికలకు నగదు నిర్వహణలో ప్రాధాన్యత ఇవ్వకూడదు.
సమయపాలన… నగదు నిర్వహణ విషయంలో సమయ పాలన అనేది చాలా ముఖ్యం… పెట్టుబడులు పెట్టె ముందు ఏ సమయంలో పెట్టాలి అనేది కచ్చితంగా ఒక అవగాహన ఉండాలి… లాభం వస్తుందని ఒక రంగాన్ని ఎంచుకున్న సమయంలో… ఆలస్యం చేయకుండా దాని మీద ఒక అవగాహనకు వచ్చి పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది… సమయ పాలన లేకపోతే మాత్రం డబ్బు ఆధాలో చాలా కష్టం…
ప్రాధాన్యత… పెట్టుబడులు గాని, ఖర్చులు గాని చేసే సమయంలో ప్రాధాన్యత అనే అంశం చాలా కీలకం… ఖర్చులు చేసే సమయంలో ప్రాధాన్యతకు విలువ ఇవ్వాలి… ఇది అవసరం లేదు అనుకుంటే మాత్రం… దానికి ప్రాధాన్యత తగ్గించి… ప్రాధాన్యత ఉన్న వాటికి పెట్టుబడులు పెట్టాలి… ఉదాహరణకు… బంగారం ధరలు తగ్గాయి మరో వారం రోజుల్లో పెరిగే అవకాశం ఉందని తెలిసినప్పుడు… మీకు ఫోన్ కొనుక్కోవాలి అనే కోరిక ఉంటే దాన్ని వాయిదా వేసుకుని బంగారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.