మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం లభ్యమైంది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వ గ్రామం వెలుగుచూసింది. ఈ విషయం తెలియకుండా వారం రోజులుగా అదే నీటిని స్థానికంగా అధికారులు సరఫరా చేస్తూ వచ్చారు. అయితే, నీరు దుర్వాసన వస్తుండటంతో స్థానికుల ఫిర్యాదు మేరకు ట్యాంక్ గేట్ తెరిచి పరిశీలించగా.. కోతి కళేబరం బయటపడింది. దానిని సిబ్బంది వెంటనే తొలగించి ట్యాంకును శుభ్రం చేశారు.
కలుషితమైన నీటిని తాగిన గ్రామస్తులు తమకు ఎటువంటి వ్యాధులు వస్తాయో అని భయాందోళనకు గురవుతున్నారు.కలుషిత నీరు సరఫరా చేసిన అధికారులపై గ్రామస్థులు ఫైర్ అవుతున్నారు. నీరు తాగే క్రమంలో కోతి ట్యాంకులో పడిపోయి ఉండవచ్చని మిషన్ భగీరత సిబ్బంది అనుమానిస్తున్నారు.సిబ్బంది ట్యాంకుకు మూత పెట్టారా? లేదా అనేది తేలాల్సి ఉంది. గతంలో నాగార్జున సాగర్, నల్లగొండలలో సైతం ఇదే తరహాలో ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.