కేరళలో 24 ఏళ్ల వ్యక్తికి మంకీ ఫీవర్ పాజిటివ్… మంకీ ఫీవర్ లక్షణాలు, ట్రీట్మెంట్ మరియు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..!

-

కేరళలో 24 ఏళ్ల వ్యక్తికి మంకీ ఫీవర్ వచ్చింది. పానవలీ ట్రైబల్ కి చెందిన ఒక వ్యక్తికి మంకీ ఫీవర్ సోకిందని హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చెప్పారు. దీంతో ఆ 24 ఏళ్ల వ్యక్తిని మనన్తవాడై మెడికల్ కాలేజ్ లో అడ్మిట్ చేశారని.. ప్రస్తుతం మెడికల్ అబ్జర్వేషన్ లో ఉన్నారని చెప్పారు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకూ కేవలం ఈ ఒక్క కేసు మాత్రమే వచ్చిందని ఇంక మరెవరికీ మంకీ ఫీవర్ రాలేదని తెలిపారు. మంకీ ఫీవర్ అనేది ఒక వైరల్ జ్వరం. ఈ వైరస్ ఫ్లవివిరిడే వైరస్ కుటుంబానికి చెందింది. ఇది కోతుల ద్వారా సోకుతుంది. కేరళలో ఇప్పటివరకూ మంకీ వైరస్ తో ఏ కేసు నమోదు కాలేదు. కేవలం ఈ ఒక్క వ్యక్తి మాత్రమే ఈ వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది.

మంకీ ఫీవర్ అంటే ఏమిటి..?

మంకీ ఫీవర్ ని kyasanar ఫారెస్ట్ డిసీజ్ అని అంటారు. ఇది ఒక వైరల్ జ్వరం. కీటకాలు, కర్రలు వంటి వాటి నుండి వ్యాపిస్తుంది. కీటకాలు వంటివి కుట్టినప్పుడు ఇది వ్యాపిస్తుంది. ఎక్కువగా కోతులు ఈ వైరస్ బారిన పడుతూ ఉంటారు. అలానే మనుషులకు కూడా ఇదే సోకె అవకాశం వుంది. ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోయిన కోతుల ద్వారా ఇది వ్యాపిస్తుంది. దీని వల్ల జ్వరం, వికారం, వాంతులు, డయేరియా వంటి లక్షణాలు వస్తాయి.

మంకీ ఫీవర్ యొక్క లక్షణాలు:

చలి వేయడం అలానే తీవ్రమైన తలనొప్పి కలగడం లాంటి వ్యాధి లక్షణాలు ఉంటాయి. అలానే ముక్కు నుండి రక్తం కారడం, గొంతు నుండి గమ్స్ నుండి కూడా రక్తం కారడం, ఇంటస్టైన్స్ నుండి కూడా రక్తం కారడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇది 3 నుండి ఎనిమిది రోజులపాటు మనిషిలో ఉంటుంది.

ఇతర లక్షణాలు:

వికారం
వాంతులు
మానసిక సమస్యలు
కంటి చూపు తగ్గడం
తీవ్రమైన తలనొప్పి

ట్రీట్మెంట్:

ఇప్పటివరకు దీనికి ఒక స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది లేదు. అయితే ఈ సమస్యతో బాధపడుతుంటే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version