‘పుష్ప’ సినిమా దేశంలో ఎలాంటి సంచలన కలిగిందో అందరికీ తెలిసిందే. ఓ ప్రాంతీయ సినిమా..ఏకంగా బాలీవుడ్ నే ముక్కున వేలేసుకునేలా చేసింది. మరోసారి టాలీవుడ్ సత్తాను చాటింది. ఇదిలా ఉంటే సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజం చాలా ఫేమస్ అయ్యాయి. ఇండియానే కాదు.. విదేశాల్లో కూడా పుష్ప మానరిజం ఫేమస్ అయింది. ముఖ్యంగా ‘తగ్గదేలే’ డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. క్రికెటర్ల దగ్గర నుంచి ఇతర సెలబ్రెటీలు, నెటిజెన్లు పుష్ప డైలాగ్స్ , స్టెప్పులతో రీల్స్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా విరాట్ కోహ్లీ కూడా శ్రీవల్లి పాట స్టెప్పులు వేశాడు. బుధవారం వెస్టీండీస్ తో జరిగిన రెండో వన్ డేలో ఓడెన్ స్మిత్ గాల్లోకి కొట్టిన బంతిని బౌండరీ లైన్ దగ్గర కోహ్లీ సూపర్ క్యాచ్ పట్టాడు. దీని తర్వాత పుష్ప సినిమాలో అల్లు అర్జున్.. శ్రీవల్లీ సాంగ్ స్టెప్పేశాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#PushpaRaj
Srivalli 🤔@imVkohli 🔥 🔥
Thaggedhe Le #ViratKohli 🔥 pic.twitter.com/t7JkYIS87V— Jeevan (@Jeevan38034726) February 9, 2022