ఒక పసి పాపను కోతుల గుంపు చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే తమిళనాడులోని తంజావూరు జిల్లాలో రాజా, భువనేశ్వరి అనే భార్యాభర్తలకు వారం క్రితమే ఇద్దరు కవలలు జన్మించారు. అయితే శనివారం మధ్యాహ్నం నాడు భువనేశ్వరి స్నానం చేసేందుకు గాను బాత్రూం లోకి వెళ్ళింది ఆమె బాత్రూంలో ఉండగానే కోతుల గుంపు వచ్చిన శబ్దం వినపడింది. అయితే పసి పిల్లలను బయటే ఉన్న సంగతి గుర్తు వచ్చిన భువనేశ్వరి హడావుడిగా బయటకు పరిగెత్తుకు వచ్చింది.
అయితే అప్పటికే తమ పిల్లలను పడుకోబెట్టిన చోట పిల్లలు ఇద్దరు కనిపించలేదు. వెంటనే ఆమె వెతుక్కుంటూ బయటకు వచ్చిన క్రమంలో ఇంటి పై కప్పు మీద నుంచి శిశువు ఏడుపు వినిపిస్తుండటంతో ఆమె షాక్ కు గురైంది. పెద్ద ఎత్తున ఏడవడం మొదలు పెట్టగానే చుట్టుపక్కల వాళ్ళు కూడా గమనించి పెద్ద పెద్ద కేకలు వేశారు. దీంతో కోతులు భయపడి ఆ పాపను అక్కడే వదిలేసి వెళ్లిపోయాయి. మరో పాప కోసం వెతుకుతుండగా ఇంటి వెనుక ఉన్న చిన్న కందకం లాంటి దానిలో పడి పోయి స్పృహ కోల్పోయి ఉంది. ఆ పాపను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మొత్తానికి కోతుల గుంపు పసిపాప ప్రాణాన్ని తీయడంతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది.