కేంద్రం నుండి అదిరే స్కీమ్.. నెలకు రూ.3000 పెన్షన్‌..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందింస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి చక్కటి ప్రయోజనాలు అందుతున్నాయి. మన దేశం లో కూలీలుగా పని చేస్తూ జీవనోపాధి పొందే వాళ్ళు కూడా వున్నారు. ఈ కూలీల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు ని కూడా తీసుకు వచ్చాయి. ఈ స్కీమ్స్ వలన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు వాళ్ళ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

60 ఏళ్ల వరకు కూలీలు రోజు వారీ కూలీతో ఖర్చులు పోగేసుకుంటున్నారు. కానీ వృద్ధాప్యం వచ్చాక ఏ పనులు చేసుకోలేరు. అందుకే అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన స్కీమ్ ని తీసుకు వచ్చింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. 60 ఏళ్లు నిండిన తరవాత కేంద్రం వాళ్లకి ప్రతీ నెలా పెన్షన్ ని ఇస్తోంది. 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ వస్తుంది.

అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళకీ నెలవారీ ఆదాయం రూ. 15,000 కంటే తక్కువ ఉన్నవాళ్ళకి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందాలనుకునే వాళ్ళ వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. EPFO, NPS, NSIC సబ్‌స్క్రైబర్‌లు కి ఈ అవకాశం లేదు.

ఇలా దరఖాస్తు చేసుకోండి:

దీని కోసం మొదట మీరు www.maandhan.inని ఓపెన్ చెయ్యండి.
ఆ తరవాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేసేసి… OTP మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన తర్వాత దాన్ని ఎంటర్ చేసేయండి.
కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్ళచ్చు లేదా ఆఫ్‌లైన్ లో దరఖాస్తును చెయ్యచ్చు.

పెన్షన్ ఎంత వస్తుంది..?

రూ.3,000 వరకు పెన్షన్ పొందవచ్చు. కార్మికుల సహకారం ఆధారంగా ఇది వస్తుంది. రూ.55 నుండి రూ. 200 వరకు డిపాజిట్‌ చెయ్యచ్చు. స్కీమ్‌లో 50 శాతం లబ్ధిదారుడు, 50 శాతం సహకారం ప్రభుత్వం తరపున వస్తుంది. పెన్షన్ దారుడు మరణిస్తే అతని భార్య లేదా భర్త ఆ పెన్షన్ మొత్తాన్ని పొందుతారు. సంవత్సరానికి రూ.36,000 పెన్షన్ వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version