ఐపీఎల్ -2022 మెగా వేలంలో 1200 మందికి పైగా ఆటగాళ్లు

-

ప్రపంచంలో మరే లీగ్‌ కు లేని క్రేజ్‌ కేవలం ఐపీఎల్ కు మాత్రమే ఉంది. విదేశీ క్రికెటర్లు.. ఎంతో కలిసి కట్టుగా ఈ ఐపీఎల్‌ లో ఆడుతారు. అందుకే ఆటగాళ్లలో ఐపీఎల్‌ కు అంత డిమాండ్‌. ఈ ఏడాది వేలం కోసం భారీ సంఖ్యలో ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఫిబ్ర వరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్లకు తుది గడువు జనవరి 20 వ తేదీ కాగా… మొత్తం 1214 మంది ఆటగాళ్‌లు ఐపీఎల్‌ వేలం కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

ఇందులో 318 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వీరిలోఅత్యధికంగా ఆసీస్‌ కు చెందిన 59 మంది ఉన్నారు. ఇక ఇండియా దేశ వాలీ క్రికెటర్లు కూడా ఈసారి ఎక్కువ మందివేలానికి వస్తున్నారు. 903 మంది అన్‌ క్యాప్ట్‌ ఆటగాళ్లు తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారిఐపీఎల్‌ బరిలో రెండు కొత్తజట్లు అయిన అహ్మదాబాద్‌, లక్నో వస్తున్నాయి. దీంతో ఐపీఎల్‌ పై మరింత ఆసక్తి అందరిలోనూ పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version