పారిశ్రామికవాడలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను హెచ్ఎండీఎ, మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోకుండా నిర్మించిన భారీ షెడ్లను అధికారులు జేసీబీలతో కూల్చివేయించారు. పారిశ్రామికవాడలోని మూడు కంపెనీల షెడ్లను కూల్చివేయగా ఒక షెడ్‌ను సీజ్ చేశారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.