ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పినందుకు తల్లి దారుణ హత్య

-

ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పినందుకు కన్నతల్లిని కుమారుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్నం జిల్లా మల్కాపురంలో శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే, స్థానిక పీఎస్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది.

సముద్ర తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ గార్డు క్వాటర్స్‌లో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.మృతురాలి ఒంటిపై గాయాలతో రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె కోస్ట్ గార్డ్ కమాండర్ ఉద్యోగి భార్య ఆల్కా సింగ్‌గా విచారణలో పోలీసులు తేల్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు ఫైల్ చేశారు.

ఈ కేసు దర్యప్తులో భాగంగా ఆల్కా సింగ్‌‌ కుమారుడు అన్‌మోల్ సింగ్ తల్లిని చంపినట్లు పోలీసుల నిర్దారించారు.ఆన్ లైన్ గేమ్స్‌కు బానిస అయిన కుమారుడిని ఆల్కా సింగ్‌ మందలించగా.. దీంతో ఆగ్రహానికి గురైన కొడుకు కన్నతల్లిపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. హత్య అనంతరం కొడుకు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news