మహాతల్లి.. కంగారులో బిడ్డనే మర్చిపోయింది.. చివరికి?

సాధారణంగా మనం బస్సు లేదా ఆటో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు సంబంధించిన వస్తువులను జాగ్రత్తగా మన దగ్గరే ఉంచుకుంటాం. దిగి వెళ్లేటప్పుడు మన లగేజి మొత్తం అన్ని చూసుకుని దిగుతాము. కానీ ఒక్కోసారి సెల్ మర్చిపోవడం, టికెట్ చిల్లర మర్చిపోవడం వంటివి సాధారణంగా జరుగుతుంటాయి. ఇది సాధారణం.. కానీ ఇప్పుడు జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Photo of modern mom and her son in the stroller waiting for the train in a subway

ఆ ఘటన ఏంటి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. నవమాసాలు మోసి కన్నబిడ్డను ఓ తల్లి మర్చిపోయింది. ఆశ్చర్యంగా ఉంది కదా! ఇక ఈ ఘటన లండన్ లోని ఓ మహిళ తన చంటి బిడ్డతో రైలు ప్రయాణం చేస్తుంది. అయితే ఆమె దిగాల్సిన దక్షిణ లండన్ లోని పెక్క హ్యామ్ రైల్వే స్టేషన్ రాగానే ఆ మహిళ కంగారుగా దిగి వెళ్ళిపోయింది.

అయితే ఆమె బిడ్డను అక్కడే వదిలేసి వెళ్లినట్టు ఆమెకు గుర్తులేదు. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత ఆమెకు బిడ్డ గుర్తుకువచ్చాడు. వెనక్కి తిరిగి వెళ్లేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. దీంతో కన్నీళ్లు పెట్టుకుంటూ రైల్వే అధికారులను సంప్రదించింది. దీంతో రైల్వే అధికారులు మరో స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో అక్కడ కాసేపు రైలు ఆపారు.

ఇక ఆమె ఆ రైల్వే స్టేషన్ కి తీసుకెళ్ళి బిడ్డను సురక్షితంగా అప్పగించారు. అయితే ఈ ఘటన కారణంగా సమయానికి వెళ్లాల్సిన రైలు ఆలస్యంగా వెళ్లి ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఘటన ను చుసిన నెటిజన్లు కన్నబిడ్డను ఎలా మర్చిపోతారు అంటూ ఫైర్ అవుతున్నారు!