సామాన్యుల‌కు శుభ‌వార్త‌…భారీగా త‌గ్గిన పాల ధ‌ర‌లు

-

జీఎస్టీ శ్లాబులను సవరించిన నేపథ్యంలో పాలు, పాల ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గించినట్లుగా మదర్ డెయిరీ పేర్కొంది. ఈ నెల 22 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. లీడర్ పాల ధర ప్రస్తుతం రూ. 77 ఉండగా… రూ. 75కు తగ్గించామని పేర్కొన్నారు. నెయ్యి, ఐస్ క్రీమ్స్, వెన్న రేట్లు కూడా తగ్గించినట్లుగా పేర్కొన్నారు.

పాలపై సున్నా, మిగతా ఉత్పత్తులైన పన్నీర్, చీజ్, బటర్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ పై ఐదు శాతం జీఎస్టీ ఉంటుందని తెలిపారు. ఇది మాత్రమే కాకుండా ఈనెల 22 నుంచి అనేక రకాల వస్తువుల పైన జిఎస్టి భారీ మొత్తంలో తగ్గనుంది. దీంతో ప్రజలు అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్ని రోజులు జీఎస్టీ అధికంగా ఉండడంతో డబ్బులు ఎక్కువ పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు జీఎస్టీని ఎత్తివేయడంతో చాలా డబ్బులను ఆదా చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news