ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తున్నామని అధికారులు ప్రజలకు షాక్ ఇచ్చారు. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎన్టీఆర్ వైద్య సేవలను ఆపేస్తున్నామని పేర్కొన్నారు. వారి ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవలను బంద్ చేశారు. నెట్వర్క్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 2,500 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉండడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ సమస్యలను వారంలోపు పరిష్కరించాలని లేదంటే పర్మినెంట్ గా ఓపి సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు.

దీనిపై ప్రభుత్వం నుంచి సమాధానం రావాల్సి ఉంది. కాగా, ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఎంతో మంది నిరుపేద ప్రజలు ఉచితంగా వైద్యాన్ని పొందారు. ఎలాంటి డబ్బులు లేకుండా ఎంతటి వైద్యాన్ని అయినా ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా వ్యాధులను తగ్గించుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలను ఆపేస్తున్నామని చెప్పడంతో చాలామంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలానే ఎన్టీఆర్ వైద్య సేవలను కొనసాగించాలని హాస్పిటల్ యాజమాన్యాలను వేడుకుంటున్నారు. ఈ విషయం పైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.