డిసెంబర్ 09న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిస్కరించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు తెలంగాణ తల్లి సాధారణ మహిళలను పోలి ఉంటుందని పలు మార్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాజాగా ఈ విగ్రహం నమూనా విడుదల చేసారు. ఆకుపచ్చని చీరలో తెలంగాణ తల్లి ఉంది.
24 పీట్ల వరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. తెలంగాణ తల్లి ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న కంకులు ఉన్నాయి. మెడలో కంటె, బంగారు ఆభరణాలు ఉన్నాయి. ప్రతీ సమాజం ఈ విగ్రహాన్ని చూడగానే మన తల్లి అనేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలో పేర్కొన్నారు. గతంలో ఉన్న విగ్రహానికి.. ఈ విగ్రహానికి చాలా తేడాలు ఉన్నాయి. సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 09న సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇప్పటికే విగ్రహ ఏర్పాటు కోసం అన్ని సిద్ధం చేశారు.