భర్త షాపింగ్ కు తీసుకెళ్లలేదని.. ఆ ఇల్లాలు ఏమి చేసిందంటే

-

భార్య,భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుండడం సహజమే. అయితే వారి మధ్య గొడవలకు పిల్లలను బలితీసుకోవడం మాత్రం క్షమించరాని నేరం. భర్త షాపింగ్ కు తీసుకెళ్లలేదని ఒక ఇల్లాలు చేసిన పనికి అందరూ షాక్ ను గురవ్వుతున్నారు. అలాంటి ఒక సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా లో జరిగింది. వివరాల్లోకి వెళితే… ఆగ్రా లోని ఆలీ గఢ్ ప్రాంతంలోని రాంపూర్ గ్రామానికి చెందిన రాహుల్ శర్మ,పింకీ శర్మ లు భార్య భర్తలు. అయితే వీరికి ఆరు నెలల పాప సోనీ ఉంది. అయితే హోలీ పండుగ దగ్గర పడుతుండడం తో భర్తని షాపింగ్ కు తీసుకెళ్ళాలి అంటూ పింకీ కోరింది. దీనికి రాహుల్ శర్మ నాకు అనారోగ్యంగా ఉందని,మరోరోజు వెళదామంటూ చెప్పాడు. అయితే దానికి కోపం తెచ్చుకున్న ఆ ఇల్లాలు ఏకంగా తన చేతుల్లో ఉన్న ఆరు నెలల పసికందు ను విసిరికొట్టింది. దీనితో పాపకు తీవ్ర గాయాలు అవ్వడం తో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికీ ఆ చిన్నారి మాత్రం బ్రతకలేదు. దీనితో ఆరు నెలల ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. నిజంగా పింకీ చేసిన పనికి అందరూ కూడా తల్లి అన్న పదానికి మచ్చ తెచ్చింది అని అంటున్నారు.

నిజంగా ఏదైనా కోపం ఉంటే భర్త మీద ప్రదర్శించాల్సింది పోయి, కనీసం అమ్మ అని కూడా పిలవలేని ఆరు నెలల చిన్నారి పై చూపించడం తో ఆ చిన్నారి మృతి చెందింది. దీనితో పింకీ పై కుటుంబసభ్యులు పోలీస్ కేసు పెట్టినట్లు తెలుస్తుంది. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యానేరం కింద ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version