రేవంత్ ది శనిపాదం… టీడీపీని నిలువునా ముంచాడు : మోత్కుపల్లి

-

తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ పై మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపిని నిలువునా ముంచింది రేవంత్ రెడ్డి అని… ఏపీలో చంద్రబాబు, టిడిపి లేకుండా ఉండడానికి రేవంత్ కారణమని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ది శనిపాదమని… రేవంత్ ది దొరలపాలన కుటుంబమన్నారు. రేవంత్ ఇంటి ముందు నుంచి దళితులు చెప్పులు వేసుకొని నడవనియ్యరని ఫైర్‌ అయ్యారు.

బ్లాక్ మెయిల్ చేస్తున్న రాజకీయ నాయకుడు రేవంత్ అని… సమాచార హక్కు చట్టం ఉపయోగించుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. మల్లారెడ్డి దగ్గర బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నావా లేదా.. ? రేవంత్ కూతురు పెళ్లి మల్లారెడ్డి దగ్గర తీసుకున్న డబ్బుల తో చేయలేదా.. ? కూతురు మీద ఒట్టేసి రేవంత్ నిజం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దుర్మార్గుడికి పిసిసి ఇచ్చారన్నారు. బిజెపి పాదయాత్ర ఎందుకు చేస్తోందని… మొనగాళ్ళు అయితే కేసీఆర్ పెట్టిన స్కీము ను ప్రవేశ పెట్టాలని తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళ సీఎం ల చర్మం వలిచి చెప్పులు కుట్టించారా….? రేవంత్ దళితులను, పేద వర్గాలను మోసం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. కేసీఆర్ కు మద్దతుగా దళితులు నిలవాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version