స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా.. మోటో జి9 పవర్ పేరిట భారత్‌లో ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఇందులో 6.78 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన మాక్స్ విజన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ పంచ్ హోల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ లభిస్తాయి. వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడు మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ ప్లాస్టిక్ బాడీని కలిగి ఉంటుంది. డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను సైడ్ భాగంలో ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ లభిస్తుంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇందులో అమర్చారు. దీనికి 20 వాట్ల టర్బో పవర్ చార్జింగ్ ఫీచర్ లభిస్తుంది.
మోటో జి9 పవర్ స్పెసిఫికేషన్స్…
* 6.78 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1640 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
* 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10
* 64, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డస్ట్, వాటర్ రెసిస్టెంట్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, డ్యుయల్ బ్యాండ్ వైఫై, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్
మోటో జి9 పవర్ స్మార్ట్ ఫోన్ మెటాలిక్ సేజ్, ఎలక్ట్రిక్ వయోలెట్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ రూ.11,999 ధరకు డిసెంబర్ 15 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది.