మాల్‌దీవ్స్‌లో నాగిని హ‌ల్‌చ‌ల్‌!

-

టెలివిజ‌న్ సీరియ‌ల్ `నాగిన్‌`తో బాలీవుడ్‌లో పాపుల‌ర్ అయ్యింది మౌనీరాయ్‌. `రన్‌` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా భారీ చిత్రాల్లో న‌టించ‌క‌పోయినా ప్ర‌త్యేక గీతాల్లో హోయ‌లొలికించి కుర్ర‌కారుని మెస్మ‌రైజ్ చేసింది. ప్ర‌స్తుతం `బ్ర‌హ్మాస్త్ర‌`లో న‌టిస్తున్న నాజూకు అందాల నాగిన్ మాల్దీవ్స్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. టూ పీస్ బికినీల్లో బీచ్‌ల‌లో విహ‌రిస్తూ హంగామా చేస్తోంది. షూటింగ్ లు పెద్ద‌గా లేక‌పోవ‌డంతో మౌనీ రాయ్‌కి కావాల్సి నంత టైమ్ దొరికింది. దీంతో వెకేష‌న్‌ని ఎంజాయ్ చేయ‌డం కోసం మ‌ల్దీవ్స్‌లో ల్యాండైంది.

బీచ్‌ల‌లో విహ‌రిస్తూ సెగ‌లు పుట్టిస్తోంది. త‌ను ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్‌ని, వీడియోస్‌ని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ నెటిజ‌న్స్‌ని హీటెక్కిస్తోంది. మౌనీరాయ్ బీచ్‌లో కోకోన‌ట్‌ని ప‌ట్టుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇన్ స్టాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోని ఇప్ప‌టి వ‌ర‌కు 5ల‌క్ష‌ల మంది వీక్షించారు. ఈ వీడియోతో పాటు థై షో చేస్తూ మౌనీరాయ్ సైక్లింగ్ చేసిన ఫొటోని కూడా షేర్ చేసింది. ఈ ఫొటోకి ఆరు ల‌క్ష‌ల‌కు మించి లైక్స్ వ‌చ్చాయంటే మౌనీ ఏరేంజ్‌లో నెటిజ‌న్స్‌ని మాయ చేస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version