బంగారాన్ని తవ్వుతున్న స్థానికులు… వీడియో వైరల్..!

-

తాజాగా డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో ఒక వింత సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. బంగారం తో నిండి ఉన్న పర్వతాన్ని కనుగొన్న తర్వాత అధికారులు ఒక గ్రామం లో మైనింగ్ ని నిషేదించాల్సి ఉందని చెప్పారు. సోషల్ మీడియా లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ Ahmad Algohbary ఒక వీడియో ని షేర్ చేయడం జరిగింది. ఆ గ్రామ ప్రజలు బంగారం అధికంగా ఉన్న ప్రాంతాన్ని కనుగొన్న తర్వాత కాంగో యొక్క దక్షిణ ప్రావిన్స్లో సౌత్ కివు లో ఉన్న పర్వతాన్ని తవ్వడం మొదలు పెట్టారు. పైగా వాళ్లు తవ్వడానికి కొన్ని పరికరాలను కూడా ఉపయోగిస్తున్నారు.

ఇలా వాటి తో మట్టి నుంచి బంగారాన్ని తవ్వుతున్నారు. కొంత మంది అయితే వట్టి చేతుల తో తవ్వేస్తున్నారు. ఆ కంట్రీ లో ఉన్న మరి కొంత మందికి ఇది నిజంగా సర్ ప్రైజ్ గా అనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా బంగారం తో నిండి ఉంది. ఆ పర్వతం లో ఉన్న మట్టి మొత్తం తవ్వేసి బంగారం తీసుకుని ఇళ్లకు వెళ్లి పోతున్నా.రు ఆ తర్వాత బంగారాన్ని శుభ్రం చేసుకుంటున్నారు అని ఈ జర్నలిస్ట్ వ్రాసారు.

మరొక వీడియో లో బంగారాన్ని శుభ్రం చేస్తూ చెత్తాచెదారం ఏరేసి పక్కన పెట్టేస్తున్నారు. ఒకరిద్దరు కాదు ఈ బంగారాన్ని చాలా మంది తవ్వేస్తున్నారు. నిజంగా ఇది చాలా మందిని ఒత్తిడి చేస్తోంది అని సౌత్ కివు మైన్స్ మినిస్టర్ Venant Burume Muhigirwa చెప్పారు. గ్రామం లో ప్రజలు భారీగా రావడం తో మైనింగ్ నిషేధించాలని అధికారులు చెప్పారు.

ముగింపు దృవీకరణ ఉత్తర్వు తదుపరి నోటీస్ వచ్చే వరకు అన్ని మైనింగ్ కార్యకలాపాలను నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. ఇలా ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్లుగా జీవనాధారం మైనింగ్ ప్రాథమిక సాధనాల తో తీయడం దీని ప్రక్రియ. ఇలా చేయడం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో చాలా సాధారణం. కాంబో లో ఎక్కువగా టింబర్, డైమండ్స్ మరియు మినరల్స్ దొరుకుతూనే ఉంటాయి. ఇలా ఇక్కడ చూపించిన పద్ధతిలో గోల్డ్ మైనింగ్ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version